సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 7 ఆగస్టు 2021 (16:49 IST)

చేనేత మ‌న సంప్ర‌దాయం... ర‌క్షించ‌డం మ‌న‌ బాధ్య‌త‌

"చేనేత మనందరి సంప్రదాయం, చేనేత ప్రతి ఒక్కరి వారసత్వం... చేనేత మన బాధ్యత, భవిత అని ఏపీ  చేనేత,జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. విజ‌య‌వాడ‌లో జాతీయ చేనేత వారోత్స‌వాల‌ను మంత్రి ఘ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, నైపుణ్యమున్న చేనేతల ద్వారా భావితరాలకు శిక్షణ ఇప్పించాల‌ని... ఇపుడు చేనేత రంగం మన ప్రస్థానం..మరో ప్రస్థానంగా మారుతుంద‌న్నారు. 
 
మా బట్టలు మేమే తయారుచేసుకుంటాం.. మా సంప్రదాయ వస్త్రాలు మేం త‌యారు చేసుకుంటామని బ్రిటిష్ వారికి ఎలుగెత్తి చాటారు మహాత్మా గాంధీ... చేనేత అన్న పదం వింటే నాకు గుర్తొచ్చేది చట్రంతో వస్త్రం నేయటమే... నాకు మరచిపోలేని మంచి జ్ఞాపకమ‌న్నారు మంత్రి. గ్రామీణ స్థాయిలో అభివృద్ధిని చాటుతాం, గ్రామ స్వరాజ్యం దిశగా అడుగు వేస్తాం అని అంద‌రూ శ‌ప‌థం చేయాల‌న్నారు.
 
అభివృద్ధి అంటే పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు కాదు, గ్రామీణ స్థాయిలోనూ సకల సౌకర్యాలు కల్పించడమన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వచనం అని మంత్రి మేక‌పాటి చెప్పారు. ఖాదీ, చేనేత, పొందూరు వస్త్ర పరిశ్రమల ద్వారా తయారైన వస్త్రాలను నవతరానికి చేరువ చేస్తామ‌ని, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వెబ్ పోర్టల్ ల ద్వారా  విక్రయాలు, మార్కెటింగ్ పెంచుతామ‌న్నారు. చేనేత వస్త్రాలకి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తామ‌న్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
 
ఈ కార్య‌క్ర‌మానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆప్కో చైర్మెన్ చల్లపల్లి మోహన్ రావు, చేనేత జౌళి శాఖ కార్యదర్శి శశిభూషణ్, చేనేత జౌళి డైరెక్టర్ అర్జునరావు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.