ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 30 అక్టోబరు 2021 (15:15 IST)

పట్టాభితో బూతు డ్రామా, కుప్పంలో బాబు బాంబు డ్రామా: రోజా సెటైర్లు

వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి చంద్రబాబు నాయుడుపై సెటైర్లు పేల్చారు. ఆమధ్య పట్టాభితో బూతు డ్రామాలు చేయించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కుప్పంలో బాంబు డ్రామాలు చేసారంటూ ఎద్దేవా చేసారు.
 
ఆయన ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు ఆయన మాట వినే స్థితిలో లేరన్నారు. కుప్పంలో గుక్కెడు నీళ్లయినా అందించలేని బాబు ఏ ముఖం పెట్టుకుని నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటూ విమర్శించారు.
 
చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే ముఖాముఖి సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్లు గెలుపు వైసిపిదేనని ధీమా వ్యక్తం చేసారు. పాపం బాబు చాలా ఫ్రస్టేషన్లో వుండి ఇలా దిగజారిపోతున్నారంటూ ఎద్దేవా చేసారు.