చంద్రబాబు కుప్పం సభలో మూటతో వచ్చిన వ్యక్తి: బాంబులు తెచ్చాడంటూ చుట్టుముట్టారు
తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభ స్థలంలోకి ఓ వ్యక్తి మూటతో కనబడ్డాడు. అందులో బాంబులు వున్నాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేసారు. అతడిని చుట్టుముట్టి మూటను విప్పగా అందులో రాళ్లు లభించాయి. అతడిపై తెదేపా కార్యకర్తలు దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అతడిని తీసుకుని వెళ్లారు.
ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. చేతకాని పాలన చేస్తున్నారనీ, రౌడీలు, గూండాలకు తాము భయపడబోమని అన్నారు. దమ్ముంటే నేరుగా చర్చలకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
మంత్రుల్లో బూతులు మంత్రులు, బెట్టింగ్ మంత్రులు వున్నారని ఎద్దేవా చేసారు. చెత్తపై పన్ను వేసిన ఘనత జగన్ కే చెల్లుతుందనీ, త్వరలో ఇంటి పన్ను పదిరెట్లు పెంచుతారని చెప్పుకొచ్చారు.