గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 26 అక్టోబరు 2021 (21:01 IST)

ఎపిలో అంతా నా ఇష్టంలా సాగుతోంది: పురందరేశ్వరి ఫైర్

మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత పురందరేశ్వరి ఎపి ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యంగా ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతా నా ఇష్టం అన్న విధంగా ఎపిలో పాలన కొనసాగుతోందన్నారు. కక్ష సాధింపులో కాదు అభివృద్ధిలో మీ సత్తా చూపించండి అంటూ పురందరేశ్వరి అన్నారు. 
 
బద్వేలు ఉప ఎన్నికల ప్రచారానికి వెళుతూ రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో పురందరేశ్వరి మాట్లాడారు. ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి భయపెడతారా అంటూ ప్రశ్నించారు. బద్వేలులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని అనుకోవడం లేదు. 
 
బద్వేలు ప్రజలు చైతన్యవంతులు కండి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్థిలో సగం నిధులు ఇస్తున్నది బిజెపి పార్టీయేనన్న విషయాన్ని గుర్తెరగండి. బిజెపి అభ్యర్థిని గెలిపించండని కోరారు. అభివృద్థి బిజెపితోనే సాధ్యమన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు పురందరేశ్వరి.
 
మరోవైపు బద్వేలు ఉపఎన్నిక త్వరలో జరుగుతున్న నేపథ్యంలో బిజెపి అగ్రనేతలందరూ బద్వేలుకు క్యూ కట్టారు. అధికార వైసిపి చేసింది శూన్యమని.. బిజెపికి ఓటెయ్యాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఈసారి బద్వేలు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయం ఖాయమన్న ధీమాలో ఉన్నారు.