శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 30 అక్టోబరు 2021 (15:02 IST)

చంద్రబాబు ఫ్లెక్సీలను చింపేసిన గుర్తుతెలియని వ్యక్తులు, అలానే సాగుతున్న బాబు

చిత్తూరుజిల్లా కుప్పంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. శాంతిపురం నుంచి రాళ్ళబూదుగూరు వరకు టిడిపి ఫ్లెక్సీలను చించేశారు గుర్తు తెలియని వ్యక్తులు. చంద్రబాబు రోడ్ షోకు దారి పొడవునా ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు.
 
అయితే ఫ్లెక్సీలను చించేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. నిన్న లక్ష్మీపురంలో ఫ్లెక్సీలను చించేయడం.. ఆ తరువాత వైసిపి ఫ్లెక్సీలను టిడిపి నేతలు చించేయడం జరిగింది.
 
దీంతో గత రెండురోజుల నుంచి చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తలకు కారణమవుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొంది. కుప్పం టౌన్లో రోడ్ షో కొనసాగుతూనే ఉంది. ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ రోడ్ షో ముందుకు సాగుతోంది.