సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (19:36 IST)

సెల్ఫీ వీడియో పిచ్చి.. ట్రైన్ వస్తుండగా ఫోజు.. తలకు, చేతికి తీవ్ర గాయాలు.. (వీడియో)

యువతకు సెల్ఫీల పిచ్చి బాగా ముదిరింది. సెల్ఫీలపై మోజుతో, లైక్స్, షేర్ల పిచ్చితో ప్రాణాలను కోల్పోతున్నారు. దేశంలో సెల్ఫీలతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగిపోతూ వుంది. తాజాగా భరత్ నగర్ రైల్వే స్టేషన్

యువతకు సెల్ఫీల పిచ్చి బాగా ముదిరింది. సెల్ఫీలపై మోజుతో, లైక్స్, షేర్ల పిచ్చితో ప్రాణాలను కోల్పోతున్నారు. దేశంలో సెల్ఫీలతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగిపోతూ వుంది. తాజాగా భరత్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. సెల్ఫీ వీడియో కోసం ప్రయత్నించి ఓ యువకుడు తీవ్రంగా గాయాలపాలైనాడు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని భ‌ర‌త్ న‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఓ యువ‌కుడు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించాడు. రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్న శివ అనే యువకుడు తన సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. సెల్ఫీ వీడియో కోసం ఫోన్‌ను సిద్ధం చేసుకున్నాడు. 
 
తన వెనుక నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ వ‌స్తుండ‌గా దాన్ని ఓ చేతితో చూపిస్తూ ఫోజులిచ్చాడు. అయితే కథ అడ్డం తిరిగింది. అతని చేతిని రైలు ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పి శివ కింద పడ్డాడు. ఈ ఘటనలో అతనికుడి చేతికి, త‌ల‌కి బ‌లంగా తాకింది. గాయ‌ప‌డ్డ‌ ఆ యువ‌కుడిని గుర్తించిన రైల్వే సిబ్బంది ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అత‌డి ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏమీ లేద‌ని వైద్యులు వెల్లడించారు.