మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (10:56 IST)

'సీఐ అక్రమ సంబంధం' : అనిశా ఏఎస్పీ సునీతారెడ్డిపై వేటు

తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి సీఐ మల్లికార్జున రెడ్డితో అవినీతి నిరోధక శాఖ (అనిశా) అదనపు ఎస్పీ సునీతా రెడ్డి కొనసాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధం పెను చర్చనీయాంశమైంది.

తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి సీఐ మల్లికార్జున రెడ్డితో అవినీతి నిరోధక శాఖ (అనిశా) అదనపు ఎస్పీ సునీతా రెడ్డి కొనసాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధం పెను చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో సునీతారెడ్డిని ఆమె భర్తే స్వయంగా పట్టుకుని కుటుంబ సభ్యుల ముందు నిలబెట్టాడు. దీంతో సునీతారెడ్డి అత్త, అమ్మలు కలిసి సీఐ మల్లికార్జున రెడ్డిని చెప్పుతో కూడా కొట్టారు. ఈ వ్యవహారంపై అటు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు, ఇటు అనిశా ఉన్నతాధికారులు మండిపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో సునీతారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన నివేదికను డీజీపీకి ఐజీ స్టీఫెన్ రవీంద్ర అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా ఆమెను సస్పెండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సునీతారెడ్డి వివాదాస్పద వ్యవహార సరళితో పోలీస్ శాఖ పరువుపోయిందని ఉన్నతాధికారులు మండిపడుతున్నట్టు సమాచారం. కాగా, సీఐ మల్లికార్జున రెడ్డిని కూడా ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే.