మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (15:48 IST)

భార్యతో సఖ్యంగా లేను సునీతను త్వరలోనే పెళ్లి చేసుకుంటా : సీఐ మల్లికార్జున రెడ్డి

తమ మధ్య వివాహేతర సంబంధం లేదనీ కానీ మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుందామని భావించామని కల్వకుర్తి సీఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఆయన అవినీతి నిరోధక శాఖలో ఏఎస్పీగాగా పని చేసే సునీతా రెడ్డితో వివాహేతర సంబ

తమ మధ్య వివాహేతర సంబంధం లేదనీ కానీ మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుందామని భావించామని కల్వకుర్తి సీఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఆయన అవినీతి నిరోధక శాఖలో ఏఎస్పీగాగా పని చేసే సునీతా రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకోగా, ఈ విషయాన్ని సునీతా రెడ్డి భర్త స్వయంగా పట్టుకుని ఆమె బంధువులకు అప్పగించారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనమైంది. 
 
ఇదిలావుంటే, కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డి వివరణ పేరుతో ఒక వాట్సప్‌ సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో తమకు వివాహేతర సంబంధం లేదని, అధికారికంగానే పెళ్లి చేసుకుందామని అనుకున్నామని మల్లికార్జునరెడ్డి చెపుతున్నట్టుగా ఉంది. ఆదివారం రాత్రి సునీతారెడ్డిని ఇంటి వద్ద డ్రాప్‌ చేయడానికి వెళ్లానని అందులో పేర్కొన్నారు.
 
'సునీతతో నాకు ఐదేళ్లుగా పరిచయం ఉంది. ఆమె విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. విడాకులు మంజూరైన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సునీతారెడ్డి భర్తకు ఈ విషయాలన్ని చెప్పాను' అని మల్లికార్జున్‌ రెడ్డి అన్నట్లు వాట్సప్‌ సందేశంలో ఉంది. 
 
తన భార్యతో సఖ్యంగా లేనని, త్వరలోనే మీడియా ముందుకు ఇద్దరం వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామని మల్లికార్జున్‌ అన్నట్లు అందులో పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారంపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీంతో సీఐ మల్లికార్జున్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు. అలాగే, సునితారెడ్డిపై కూడా చర్య తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.