మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : సోమవారం, 22 జనవరి 2018 (15:51 IST)

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటిలో చోరీ...

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని మడికొండలో రోజా నివాసముంటోంది. జబర్థస్త్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడల్లా రోజా ఇక్కడే బస చేస్తూ వస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని మడికొండలో రోజా నివాసముంటోంది. జబర్థస్త్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడల్లా రోజా ఇక్కడే బస చేస్తూ వస్తోంది. అయితే షూటింగ్ కోసం బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరూ ఉండరు. ఆదివారం రాత్రి రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్ళిపోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలుచేతివాటం ప్రదర్శించారు. 
 
ఇంటి ముందు ఉన్న గ్రిల్స్‌ను తొలగించి, తాళాలను పగులగొట్టి ఇంటిలోని 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్ళారు. మరుసటి రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రోజా ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వేలిముద్రలను సేకరించింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.