1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Monkeypox suspected case in Guntur boy admitted GGH hospital

గుంటూరులో మంకీ ఫాక్స్ కలకలం.. ఒంటిపై దద్దుర్లతో ఎనిమిదేళ్ల బాలుడు?

monkey fox
దేశాన్ని కరోనా వైరస్ ఇంకా వీడలేదు. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం మంకీ ఫాక్స్ కోరలు చాచుతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ, కేరళలో పలు కేసులు నమోదయ్యాయి. 
 
ఇతర రాష్ట్రాలతో పాటు తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ అలజడి సృష్టిస్తోంది. తాజాగా ఖమ్మంలో ఓ అనుమానిత కేసు నమోదవ్వడం కలకలం రేపింది. ఇప్పుడు గుంటూరులోనూ ఓ అనుమానిత కేసు వెలుగుచూసింది.
 
ఒంటిపై దద్దుర్లతో ఎనిమిదేళ్ల బాలుడు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్‌)లో చేరాడు. రెండు వారాల క్రితమే జీజీహెచ్‌కు బాలుడ్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఒంటిపై దద్దుర్లు ఉండడంతో.. మంకీ పాక్స్‌గా వైద్యులు అనుమానిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే శాంపిల్‌ను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి జీజీహెచ్ అధికారులు పంపించారు. రిపోర్ట్ ఆధారంగా తదుపరి కార్యచరణ ఉంటుందని అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుతం బాలుడ్ని ఓ ప్రత్యేక వార్డులో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. కాగా.. బాలుడి తల్లిదండ్రులు ఒడిశాకి చెందినవారు. ఉపాధి కోసం పల్నాడుకి వచ్చారు.
తర్వాతి కథనం
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లే ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా? హరిత సూసైడ్ లెటర్‌లో ఏం రాసింది?