సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 23 జనవరి 2021 (22:12 IST)

ఇదెక్కడి న్యాయం నిమ్మగడ్డా?: ఎంపీ బాలశౌరి ఆగ్రహం

ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ పైన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికీ కూడా కోర్టులు ఆన్లైన్లో నడుస్తున్నాయి. దీని అర్థమేమి నిమ్మగడ్డా?? అని ప్రశ్నించారు ఎంపి బాలశౌరి.
 
దీనికి కూడా ప్రత్యక్ష సాక్షివి నీవే, మొన్న కోర్టుకు ఆన్లైన్లో హాజరయ్యావ్. ఉద్యోగుల, ప్రజల ప్రాణానికో న్యాయం, నీ ప్రాణానికి మరొక న్యాయామా? ఇదెక్కడి న్యాయం నిమ్మగడ్డా? ఉద్యోగులంతా ఫ్రంట్ లైన్ వారియర్స్ అని మీకు తెలియదా? ఫ్రంట్ లైన్‌ వారియర్ అందరికి వ్యాక్సినేషన్ తప్పనిసరి అని కేంద్రం చెప్పింది మరచిపోయావా? లేక కేంద్రం రూల్స్ అంటే నీకు లెక్కలేదా? అని సూటిగా ప్రశ్నించారు. 
 
దీనిమీద వివరణ ఇవ్వకుండా ఎందుకు తప్పించుకుంటున్నావో చెప్పాలి. మీరు మాత్రం కరోనాకు భయపడుతూ మీ మొహాన్ని పెద్ద అద్దాన్ని అడ్డం పెట్టుకొని కూర్చొని ప్రెస్‌మీట్ పెడతారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ కరోనా సమయం‌లో నిర్వహించవద్దని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు మొర పెట్టుకుంటున్నాయి.
 
ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు మొర పెట్టుకుంటున్నా కానీ నిమ్మగడ్డ రమేష్ వారి అభ్యర్థన పెడచెవిన‌ పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఉద్యోగుల ప్రాణాలు పోయినా, ప్రజలు చనిపోయినా పర్వాలేదని మొండిగా ఎన్నికలకు వెళ్లడం అన్యాయం. కేంద్ర ప్రభుత్వం రెండో విడత వ్యాక్సినేషన్ అత్యంత ముఖ్యమైనది అని ఇప్పటికే ప్రకటించింది.. 
 
కోర్టులు కూడా వర్చువల్‌గా నడుస్తున్నాయి.. నిమ్మగడ్డ కూడా SEC తరపున వర్చువల్‌గా హాజరయ్యారు. కోర్టుల్లో కూడా సిబ్బంది కరోనా వల్ల విధులకు హాజరు కావడం లేదు. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికలు అవసరమా? ఉద్యోగస్తుల, ప్రజల ప్రాణాలు పోయినా నిమ్మగడ్డకు లెక్కలేదు. ఇలాంటి ఎన్నికల కమీషనర్ ఎప్పుడు చూడలేదు. ఇకనైనా అలోచించి ఎన్నికలు వాయిదా వేయాలి. ప్రజల, ఉద్యోగుల ప్రాణాలను ఫణంగా పెట్టడం భావ్యం కాదు అని అన్నారు ఎంపి బాలశౌరి.