Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ప్రత్యేక హోదాపై ఎద్దేవా చేస్తారా? మోదీగారూ తీరు మార్చుకోండి..

ఏపీకి ప్రత్యేక హోదా గురించి అడిగితే రక్షణ రంగం నుంచి నిధులు ఇవ్వాలా? అని ఎద్దేవా చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated: ఆదివారం, 7 అక్టోబరు 2018 (11:06 IST)
ఏపీకి ప్రత్యేక హోదా గురించి అడిగితే రక్షణ రంగం నుంచి నిధులు ఇవ్వాలా? అని ఎద్దేవా చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా గురించి అలా మాట్లాడిన ప్రధాని దేశ రక్షణకు అంత్యంత కీలకమైన అంశాలపై నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు.. రాఫెల్ డీల్‌పై ఎందుకు పెదవి విప్పడం లేదని నిలదీశారు. 
 
స్వచ్ఛ భారత్ పేరుతో తెరవెనుక బ్యాంకులను ఊడ్చేస్తున్నారని ఆరోపించారు. జీఎస్టీ అమలుతో నష్టపోయిన చిరు వ్యాపారులను ఆదుకోవాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. మోదీ తీరు చూస్తుంటే.. ఆయన కార్పొరేట్ సంస్థలకే తప్ప దేశానికి ప్రధాని కాదన్న విషయం అర్థమవుతోందన్నారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన వారిని సురక్షితంగా దేశం దాటిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా మోదీ మౌనం వీడాలని కోరారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments