ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (05:47 IST)

వైసీపీ రౌడీమూకలపనిపడతాం: నక్కా ఆనందబాబు

వైసీపీనేతలు, మంత్రులు, టీడీపీ నేత నారాలోకేశ్ ని ఉద్దేశించి అవాకులుచవాకులు పేలుతున్నారని, వారి వ్యాఖ్యల్లో ఫ్యాక్షన్ మనస్తత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, టీడీపీసీనియర్ నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. ఆయన తననివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. 
 
హత్యలు చేయడం, దళితులపై దమనకాండ, అక్రమకేసులు పెట్టడం, మూకుమ్మడిదాడిచేయడం వైసీపీవారికి అలవాటుగామారిందన్నారు. తెలుగుదేశంపార్టీ కార్యకర్తలకు అండగా తానున్నానంటూ లోకేశ్ మాట్లాడితే దానిపై వైసీపీవారికి ఎందుకంత ఉలికిపాటో, ఎందుకంత దుగ్ధో తెలియడంలేదన్నారు. ఇప్పుడున్న నాయకులు రెచ్చ గొట్టడం వల్లే రాష్ట్రంలో, మరీముఖ్యంగా రాయలసీమలో హత్యారాజకీయాలు జరుగుతున్నాయని లోకేశ్ చెప్పాడన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిప్రతిపక్షంలో ఉన్న ప్పుడు వాడినభాషపై వైసీపీవారుఏంచెబుతారని ఆనందబా బు నిలదీశారు. కేబినెట్ మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో బూతులు మాట్లాడుతున్నారో వారికి తెలియదా అన్నారు.  మంత్రిపదవులు కాపాడుకోవడానికి కొందరు, కొత్తగా పదవులుపొందేందుకు కొందరు లోకేశ్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని ఆనందబాబు దెప్పిపొడిచారు.

ముఖ్యమంత్రి విడుదలచేసిన జాబ్ కేలండర్ నిరుద్యోగులఆశల పై నీళ్లుచల్లిందన్న ఆనందబాబు, పదివేలఉద్యోగాల నోటిఫికే షన్ కు కోట్లాదిరూపాయల ప్రజలసొమ్ముతో ప్రకటనలు ఇవ్వడమేంటన్నారు. ఔట్ సోర్సింగ్ , ఆర్టీసీ ఉద్యోగాలను కూడా ఈ ప్రభుత్వమే ఇచ్చినట్టు చెప్పుకోవడం సిగ్గుచేట న్నారు. టీడీపీహాయాంలో అనేకపరిశ్రమలు వచ్చాయని, ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలివ్వడం జరిగిందన్నారు.

ప్రభుత్వరంగంలోకూడా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం, ఏపీపీఎస్సీ ఉద్యోగాలభర్తీకి రంగం సిద్ధంచేయడం జరిగింద న్నారు. యూనివర్శిటీల్లో ఉద్యోగాలన్నింటినీ చాలావరకు టీడీపీప్రభుత్వమే భర్తీచేసిందన్నారు. కోర్టుల్లో కేసులున్న ఉద్యోగాలను కూడా భర్తీచేస్తామని ఈ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగాల విప్లవం పేరుతో ప్రచారంచేసుకుంటున్న ప్రభుత్వం, ప్రజలనుంచి రాబోయే విప్లవాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగాఉండాలని ఆనందబాబు హెచ్చరించారు.

ఎందుకూ పనికిరానివాడుకూడా లోకేశ్ పై విమర్శలుచేయడం ఫ్యాషన్ గా పెట్టుకున్నాడన్నారు. లోకేశ్ చెప్పినట్టు టీడీపీప్రభుత్వం వచ్చిన మరుక్షణం వైసీపీ రౌడీమూకల గతేమిటో ఆలోచించుకోవాలన్నారు. టీడీపీ హాయాంలోప్రశాంతంగా ఉన్నరాష్ట్రాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చాక హత్యలకు నిలయంగా మార్చిందని ఆనందబాబు ఆగ్రహంవ్యక్తంచేశారు.

టీడీపీ కార్యకర్తలకు జరిగే అన్యాయాలు, అక్రమాలపై ప్రధాననాయకత్వం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందన్నారు. వైసీపీనేతలు,ప్రభుత్వం లోని వారుముందుసంస్కారం నేర్చుకొని, ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాక, లోకేశ్ భాష గురించి సూచనలు చేయాల న్నారు. భవిష్యత్ లో అయినాఈ ప్రభుత్వం బుద్ధితెచ్చుకొని, వళ్లు దగ్గరపెట్టుకొని పాలనచేస్తే మంచిదని ఆనందబాబు హితవుపలికారు.