ఎన్టీఆర్ కుమారుడు, బాలయ్య సోదరుడు జయకృష్ణకు జైలు శిక్ష
సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు, బాలయ్య సోదరుడు నందమూరి జయకృష్ణకు 6 నెలల జైలు శిక్ష విధించింది ఎర్రమంజిల్ కోర్టు. ఈ శిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది. విషయం జైలు శిక్ష వరకూ ఎందుకు వెళ్లిందంటే... అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ క్యాంటిన్
సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు, బాలయ్య సోదరుడు నందమూరి జయకృష్ణకు 6 నెలల జైలు శిక్ష విధించింది ఎర్రమంజిల్ కోర్టు. ఈ శిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది. విషయం జైలు శిక్ష వరకూ ఎందుకు వెళ్లిందంటే... అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ క్యాంటిన్, పార్కింగ్ లీజుకు సంబంధించి నందమూరి జయకృష్ణ, నర్సింగరావు అనే వ్యక్తికి ఓ చెక్ ఇచ్చారు.
కానీ అది కాస్తా బౌన్స్ అయింది. దీనితో సదరు వ్యక్తి ఎర్రమంజిల్ కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు జయకృష్ణను దోషిగా పేర్కొని ఆరు నెలలు జైలు శిక్ష, జరిమానా విధించింది. తీర్పును సవాలు చేసేందుకు నెల రోజులు గడువు విధించింది. కాగా దీనిపై జయకృష్ణ స్పందించాల్సి వుంది.