శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (19:30 IST)

జనసేన కండువా కప్పుకున్న నందమూరి బాలయ్య సోదరుడు

Nandamuri Ramakrishna
Nandamuri Ramakrishna
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సభ్యులు నిరాహార దీక్షలు చేపట్టారు. గన్నవరంలో నిరాహారదీక్ష శిబిరంలో బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ కూడా  చేరారు. ఈ సందర్భంగా ఈ నిరాహార దీక్షా శిబిరంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

నందమూరి బాలయ్య సోదరుడు నందమూరి రామకృష్ణ తన మెడలో జనసేన కండువా వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి కూర్చున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నిరాహారదీక్షలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్ష చేస్తున్న వారందరికీ తన మద్దతును ప్రకటించారు. 
 
చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా నిలబెట్టే పోరాటానికి ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.