చంద్రబాబుతో ములాఖత్.. బాలయ్య వెంట పవన్ కల్యాణ్
టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం కలవనున్నారు. పవన్ గురువారం రాజమండ్రి వెళ్తున్నారని, అక్కడి కేంద్రకారాగారంలో వున్న చంద్రబాబుతో ములాఖత్ వుంటుందని జనసేన ప్రకటించింది. పవన్ గురువారం ఉదయం గం.9.30కు రాజమండ్రి చేరుకొని, తొలుత చంద్రబాబు కుటుంబ సభ్యులతో భేటీ కానున్నారు.
భువనేశ్వరిని పరామర్శిస్తారు. అటు పిమ్మట టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబును ములాఖత్ సమయంలో కలుస్తారు. మధ్యాహ్నం గం.12. సమయానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి పవన్ టీడీపీ అధినేతను కలవనున్నారు. ములాఖత్ ఖరారైనట్లు టీడీపీ వర్గాలు కూడా వెల్లడించాయి.