"ఈగల్" బృందం ఏర్పాటు.. గంజాయి విక్రయిస్తే అంతే సంగతులు
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుండి, డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలను నియంత్రించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలను అమలు చేస్తోంది.
బుధవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై డ్రగ్స్, నార్కోటిక్స్ నియంత్రణపై చర్చించారు. ఈ సమావేశంలో ఐటీ, విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలపై యుద్ధం ప్రకటించారు.
AP యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ పేరును "ఈగిల్"గా మారుస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణాపై ఈగిల్ చురుగ్గా పర్యవేక్షణ కొనసాగిస్తుంది.
పాఠశాలలు, కళాశాలలు, సెక్రటేరియట్‌లలో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లతో సహా 10 మంది సభ్యులతో కూడిన "ఈగల్" కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
గంజాయి విక్రయించే కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందవని మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు.