గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 నవంబరు 2024 (17:29 IST)

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

ramgopal varma
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై ప్రకాశం జిల్లాలో పలు కేసులు నమోదైవున్నాయి. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఒకసారి నోటీసు జారీ చేయగా షూటింగ్ ఉందని విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈ నెల 20వ తేదీన హాజరుకావాలని ఆదేశించగా, కొంత సమయం కోరారు. 
 
మరోవైపు, ఆయనపై మరో కేసు కూడా నమోదైంది. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌‍లపై మార్ఫింగ్ ఫోటోలకు సంబంధించే ఈ కేసు కూడా నమోదు కావడం గమనార్హం. ఈ కేసులో గురువారం విడుదల కావాలంటూ రావికమతం పోలీసులు పేర్కొన్నారు. అయితే, వర్మ హాజరుకాకుండా మరోవారం రోజులు కోరినట్టు తెలిసింది.