గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (12:43 IST)

వైఛీపీ మూకల దాడి.. సిగ్గుచేటు.. మహిళలపై కూడా?: నారా లోకేష్

జనసేన కార్యకర్తలపై జరిగిన రాళ్లదాడిని ఏపీ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఖండించారు. సోషల్ మీడియాలో ఆందోళనకారులను ఏకిపారేశారు. వైఛీపీ (వైసీపీ) మూకలు చేసిన ఈ దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్య సభ్య సమాజానికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 
 
లోకేశ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ..''వై ఛీ పీ మూకలు గుంటూరు ఏటీ అగ్రహారంలో జనసేన కార్యకర్తల మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళలు అని కూడా చూడకుండా రాళ్లు రువ్వటం సభ్య సమాజానికే సిగ్గు చేటు !'' అని ట్వీట్ చేశారు. ఈ దాడికి సంబంధించిన ఫొటోలను ట్వీట్‌కు జతచేశారు.
 
మరోవైపు మంత్రి నారా లోకేష్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''డియర్ లోకేష్.. మీ నాన్నని ఓడించటానికి, నువ్వు మా కళ్ళ ఎదుట ఇక్కడే ఉండగా... మాకు మోదీ, కేసీఆర్‌లతో ఏం పని చెప్పు? తప్పమ్మా.. ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయ్, లెంపలేసుకో!'' అని ట్వీట్‌ చేశారు.