ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మే 2021 (12:24 IST)

జగన్ ఓ అమూల్ బేబీ : ధూళిపాళ్ల చేసిన తప్పేంటో? నారా లోకేశ్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర, ఆయన కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఏపీ సీఎం జగన్‌ను ఓ అమూల్ బీబేగా అభివర్ణించారు. "ఓ అమూల్ బేబీ. ధూళిపాళ్ల నరేంద్ర గారు చేసిన తప్పేంటో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. పాడి రైతులకు రూ.4 ఎక్కువ ఇవ్వటం, ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందించటం తప్పా" అంటూ ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, "ప్రజలు చనిపోతుంటే పట్టించుకోని దద్దమ్మ జగన్ రెడ్డి కక్ష సాధింపులకు ప్రాధాన్యం ఇచ్చారు. జగన్ రెడ్డి ఓ శాడిస్టు రెడ్డి. ప్రజల పక్షాన పోరాడే సొంత ఎంపీని కొట్టించిన శాడిస్టు. లక్ష కోట్లు దోపిడీ చేసి జైలుకెళ్లిన జగన్ రెడ్డి కక్షతో తెలుగుదేశం నేతల్ని జైలుకు పంపుతున్నారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే ఏ ఒక్కరి అధికారినీ వదిలిపెట్టం. ఇప్పటికైనా కక్షసాధింపు పక్కన పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి అంటూ నారా లోకేష్ డిమాండ్ చేశారు.