1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 మే 2021 (15:40 IST)

ఎస్పీ అమ్మిరెడ్డి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటా తాడేపల్లి కొంపకు చాకిరీనా?

గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎస్పీ అమ్మిరెడ్డిగారూ... ప్రజల  సొమ్మును జీతంగా తీసుకుంటూ తాడేపల్లి కొంపకు చాకిరీ చేయడం సిగ్గులేదా? అని ప్రశ్నించారు. 
 
వైకాపా రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు పోస్టు చేశారంటూ ఇద్దరు సీబీఎన్ ఆర్మీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు మంగళవారం అరెస్టు చేశారు. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. 
 
'సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన వాళ్లను అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్టు ఏంటా ఓవరాక్షన్!' అంటూ మండిపడ్డారు. ఇలాంటి వీడియోలే టీడీపీ వాళ్లపై కూడా పెట్టారని తాము గతంలో ఫిర్యాదు చేస్తే ఎన్ని కేసుల్లో అరెస్టులు చేశారు? అని లోకేశ్ నిలదీశారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు పెట్టడానికి వచ్చినవారిపైనే రివర్స్ కేసు పెట్టారు అని ఆరోపించారు.
 
"అమ్మిరెడ్డి గారూ, ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ తాడేపల్లి కొంపకు చాకిరీ చేయడానికి సిగ్గులేదా? జగన్ వద్ద పనిచేయాలని అంత ఉత్సాహం, కులపిచ్చి ఉంటే... పవిత్ర ఖాకీ డ్రెస్ తీసేసి బులుగు కండువా కప్పుకోండి" అని లోకేశ్ వ్యాఖ్యానించారు.