శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 డిశెంబరు 2023 (15:06 IST)

మరో మూడు నెలల్లో ఏపీలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకానుంది : నారా లోకేశ్

nara lokesh
మరో మూడు నెలల్లో ఏపీలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకానుంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడ సెజ్‌ బాధిత రైతులతో నారా లోకేశ్‌ ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలను వైకాపా ప్రభుత్వం తరిమేసిందని ఆయన ఆరోపించారు. మూడు నెలల్లో అధికారంలోకి వస్తామని, మళ్లీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
 
'తక్కువ కాలుష్యంతో పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత తెదేపా తీసుకుంటుంది. పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. స్థానికులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాం. టీడీపీ హయాంలో తీసుకొచ్చిన కియా పరిశ్రమ వల్ల వేలాది మంది జీవితాల్లో మార్పు వచ్చింది. పరిశ్రమలు వస్తే గ్రామాల రూపురేఖలు మారిపోతాయి. 
 
ఆక్వా రంగంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. వైకాపా ప్రభుత్వం హయాంలో ఆక్వా ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ల పరిశ్రమ తీసుకొచ్చా. ఆ పరిశ్రమలో ఆరు వేల మంది పని చేసేవారు' అని లోకేశ్‌ గుర్తు చేశారు. న్యాయం చేయాలని ప్రశ్నించిన వారిని వైకాపా ప్రభుత్వం హింసిస్తోందన్న లోకేశ్‌.. మూడు నెలల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 
 
ముగ్గురు బాలీవుడ్ నటులకు కేంద్రం షోకాజ్ నోటీసులు.. ఎందుకో తెలుసా? 
 
బావీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ముగ్గురు హీరోలకు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీచేసింది. గుట్రా సంబంధింత వాణిజ్య ప్రకటనల్లో పాల్గొంటున్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు ఈ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ముగ్గురు బాలీవుడ్ హీరోల్లో షారూక్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్‌లు ఉన్నారు. వీరికి షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయాన్ని ఈ పిటిషన్ దాఖలైన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. 
 
కొందరు అగ్రనటులు కొన్ని హానికారక ఉత్పత్తులకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోతీలాల్‌ యాదవ్‌ అనే న్యాయవాది గతంలో అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి ప్రకటనల్లో పాల్గొనడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన కోర్టు.. పిటిషనర్‌ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించింది. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ ఇటీవల పిటిషనర్‌ మరోసారి కోర్టును ఆశ్రయించారు.
 
దీనిపై స్పందన కోరుతూ కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌బీ పాండే శుక్రవారం కోర్టుకు సమాచారం అందించారు. అక్షయ్‌ కుమార్‌, షారుక్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌కు అక్టోబర్‌ 22నే షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. 
 
మరోవైపు అమితాబ్‌ బచ్చన్‌ ఇప్పటికే ఈ తరహా ప్రకటనల నుంచి తప్పుకొన్నారని న్యాయస్థానానికి పాండే తెలియజేశారు. అయినప్పటికీ.. ఓ గుట్కా కంపెనీ ఆయన ప్రకటనలను ప్రసారం చేసిందని తెలిపారు. దీంతో అమితాబ్‌ సదరు కంపెనీకి లీగల్‌ నోటీసులు పంపారని చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఓ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉందని పాండే కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా కోరారు. వాదనలు విన్న కోర్టు.. దీనిపై తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.