మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (10:14 IST)

మూడు నెలల్లో అధికారంలోకి వస్తాం.. ప్రతీకారం తీర్చుకుంటాం..?

nara lokesh
దాదాపు రెండున్నర నెలల తర్వాత టీడీపీ అధినేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. సోమవారం నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను ఆయన ప్రారంభించారు. సెప్టెంబర్ 9న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ కారణంగా లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది. ఇప్పటి వరకు 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతోంది. రెండున్నర నెలల తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. 
 
యువగళం పాదయాత్ర 210వ రోజు రాజోలు నియోజకవర్గం పొదలాడ క్యాంపు సైట్ నుండి ప్రారంభమైంది. పాదయాత్ర పున:ప్రారంభం సందర్భంగా పొదలాడకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పాదయాత్ర ప్రారంభించిన తొలిరోజు నుంచే తనను అడ్డుకునేందుకు జగన్ స్కెచ్‌2లు వేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. 
 
చంద్రబాబును అరెస్ట్ చేసి యువగళం పాదయాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబుని చూస్తేనే సైకో భయపడతాడు. అందుకే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.  వచ్చే మూడు నెలల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని, కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని లోకేష్ ప్రకటించారు. 
 
రాజారెడ్డి రాజ్యాంగాన్ని ధ్వంసం చేశారని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు నారా లోకేష్. టీడీపీ కార్యకర్తలను వేధించిన వైసీపీకి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు నారా లోకేష్.