వారెవ్వా.. రాజన్న రాజ్యంలో ఎమ్మెల్యేల దుస్థితి ఇదీ.. లోకేశ్ ట్వీట్

marshals
Last Updated: మంగళవారం, 23 జులై 2019 (14:24 IST)
వారెవ్వా.. రాజన్న రాజ్యంలో ఎమ్మెల్యేల దుస్థితి అత్యంత హీనంగా ఉందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, మంగళవారం ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వారంతా బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్‌తో బలవంతంగా బయటకు పంపించారు.

దీనిపై నారా లోకేశ్ ట్వీట్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలను బయటకు తరలిస్తున్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన లోకేశ్.. దానికింద ట్వీట్ చేశారు. "వారెవ్వా... ప్రజల పక్షాన నిలిస్తే..
రాజన్న రాజ్యంలో నాయకుల పరిస్థితి ఇదీ..!" అంటూ కామెంట్స్ చేశారు.

కాగా, సభా కార్యక్రమాలకు నిత్యమూ అడ్డుపడుతున్నారన్న కారణంతో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చెయ్య చౌదరిలను ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ దాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే.


దీనిపై మరింత చదవండి :