సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (13:20 IST)

పల్నాడు జిల్లాలో నారా లోకేష్ పర్యటన

nara lokesh
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండలం రావులాపురంలో  పర్యటించనున్నారు. 
 
ఇటీవల హత్యకు గురైన టిడిపి కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని లోకేష్‌ పరామర్శించి బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. 
 
లోకేష్‌ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీలు చేపట్టకుండా పల్నాడు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీచేశారు.