శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (12:52 IST)

అమ్మకు కేకు తినిపించిన తనయుడు.. నారా లోకేశ్ ట్వీట్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 58వ పుట్టిన రోజు వేడుకలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా ఆమె కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వయంగా కేకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన తన తల్లి పుట్టిన రోజు వేడుకలను జరిపారు. ఆ తర్వాత తల్లతో కేక్ కట్ చేయించి తినిపించారు.
 
ఇందుకు సంబంధించిన చిత్రాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "నాకు బెస్ట్ ఫ్రెండ్‌గా నిలిచినందుకు కృతజ్ఞతలు అమ్మా. నాకు కష్టపడి పని చేయడాన్ని నేర్పించావు. క్షమాగుణాన్ని నేర్పించావు. ఎప్పుడూ నా క్షేమం కోరుకుని, నన్ను అంటిపెట్టుకునే ఉంటావు. ఎల్లప్పుడూ నా శ్రేయస్సును కోరుకునే నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్ కాగా, టీడీపీ అభిమానులు భువనేశ్వరికి శుభాభినందనలు చెబుతూ, ట్వీట్లు పెడుతున్నారు.