శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (12:59 IST)

బీసీ అయినా ఓసీ అయినా తప్పు చేస్తే శిక్ష తప్పదు.. రోజా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతితో దొరికిపోయాడని... ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకల్లో జరిగిన అవినీతితో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పేద కార్మికుల వైద్యానికి కేటాయించిన డబ్బును అచ్చెన్నాయుడు దోచుకున్నారని ఆమె మండిపడ్డారు. తప్పు చేసి వివరణ ఇస్తే సరిపోదని రోజా అన్నారు. తప్పు చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. 
 
తప్పు చేశారే కాబట్టే మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసిందని రోజా చెప్పుకొచ్చారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకావడం లేదని రోజా విమర్శించారు. తప్పు చేసిన వ్యక్తి బీసీ అయినా ఓసీ అయినా... చట్టం ముందు అంతా సమానమే అని వ్యాఖ్యానించారు. 
 
నారా లోకేశ్ మాటలకు విలువ లేదని... ప్రజల్లో గెలవలేని వ్యక్తి చెప్పే మాటలు ఎవరూ పట్టించుకోరని ఆమె అన్నారు. తాము తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోవచ్చని గతంలో తొడగొట్టిన లోకేశ్... సాక్ష్యాలతో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే ఎందుకు మండిపడుతున్నాడని రోజా విమర్శించారు.