1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2016 (10:14 IST)

బాలికపై పలుమార్లు అత్యాచారం.. ఆపై పెళ్లి చేసుకున్నాడు.. ఇంట్లో వదిలేశాడు..

బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా ఆడ శిశువులపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా బాలికను బ్లాక్ మెయిల్ చేసుకున్న ఓ కామాంధుడు.. అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే.. ‘టి.

బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా ఆడ శిశువులపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా బాలికను బ్లాక్ మెయిల్ చేసుకున్న ఓ కామాంధుడు.. అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే.. ‘టి. నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన గురజాల వీరాంజనేయులు, రెండేళ్ల క్రితం తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక స్కూలుకు వెళ్లి వస్తుండగా.. అడ్డగించి బలవంతంగా తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 
 
అప్పటి నుంచి క్రమంగా ఆమెను భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలికను భద్రాచలం తీసుకెళ్లి అక్కడా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆపై జంగారెడ్డిగూడెంలోని పారిజాతగిరిలో ఆమెను మే నెలలో వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తరువాత బాధితురాలి తల్లిదండ్రుల ఇంటికి తీసుకువచ్చి వదిలేశాడు. ఎందుకు వదిలేశావని ప్రశ్నించినందుకు బాలిక తండ్రి ఇంటిపై వీరాంజనేయులు, అతని కుటుంబ సభ్యులు 8 మంది దాడి చేశారు. 
 
బాలిక తండ్రిని కులం పేరుతో దూషించి చంపుతామని బెదిరించారు. ఇక లాభం లేదనుకుని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.