సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 15 సెప్టెంబరు 2021 (12:56 IST)

ఆ యువతిపై దాడి చేసింది వెంక‌టేష్, వీడియో తీసింది శివ‌కుమార్

నెల్లూరు జిల్లా  రామకోటయ్య నగర్ కు చెందిన ఓ యువతిపై ఓ వ్యక్తి విచక్షణరహితంగా దాడి చేసి, క‌ర్ర‌తో కొట్టిన కేసు మిస్ట‌రీ వీడుతోంది. ఈ దాడి చేసిన వాడు వెంక‌టేష్, వీడియో తీసిన వాడు శివ‌కుమార్ గా గుర్తించారు. ముందుగా శివ‌కుమార్ ని పోలీసులు ప‌ట్టుకున్నారు. అత‌ను త‌నే వీడియో తీశాన‌ని ఒప్పుకున్నాడు. త‌ర్వాత పరారీలో ఉన్న వెంక‌టేష్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై జరిగిన దాడి కేసులో ఇద్దరినీ అరెస్టు చేశారు. 
 
సోషల్ మీడియాలో ఈ యువ‌తి దాడి వైరల్ కావడంతో స్పందించిన ఎస్పీ విజయరావు మూడు బృందాలుగా పోలీసుల‌ను గాలింపున‌కు ఏర్పాటు చేశారు. ప్రధాన నిందితుడు వెంకటేష్ ని కలువాయి ప్రాంతంలో  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువ‌తిపై దాడి చేసిన యువకుడు పల్లాల వెంకటేష్ గా గుర్తించారు. రాపూరు మండలం, తెగచర్లలో నిందితుడిని అరెస్టు చేశారు. 
 
నెల్లూరు రూరల్ పరిధిలోని రామకోటయ్య నగర్ కు చెందిన ఓ యువతిపై వెంట‌క‌టేష్ విచక్షణరహితంగా దాడి చేసాడు. వ్యభిచారం చేయాలంటూ  కర్రతో చితకబాదాడు. ఎంత బ్రతిమిలాడిన ఆ వ్యక్తి మాత్రం కనికరించలేదు. మరింత రెచ్చిపోయి దాడి చేశాడు. శివ‌కుమార్తో దాడి దృశ్యాలను వీడియా తీయీస్తూ,  పైశాసిక ఆనందం పొందాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావ‌డంతో జిల్లా పోలీసు అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.