సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (08:03 IST)

76 మంది జవాన్లను హతమార్చిన మావోయిస్టు అరెస్టు

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో రూ. 8 లక్షల నగదు రివార్డు కలిగిన మావోయిస్ట్ నేతను పోలీసులు అరెస్టు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

కొన్ని సంవత్సరాల కిందట సుక్మా జిల్లాలో 76 మంది సీఆర్ పీఎఫ్ సిబ్బందిని అంబుష్ లో బంధించి చంపిన నక్సలైట్ ను అరెస్టు చేయడంలో బిజాపూర్ జిల్లా పోలీసులు విజయం సాధించారు.

ఈ సంధర్బంగా అక్కడ హై అలర్ట్ ప్రకటించారు . ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టుపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.

అరెస్టు అయిన నక్సలైట్ పేరు మోతిరామ్ అవలం బీజాపూర్, సుక్మా జిల్లాల్లో వివిధ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు.