సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:36 IST)

సింథటిక్ డ్రగ్స్‌తో పట్టుబడిన బీటెక్ విద్యార్థులు

ఏపీలోని గుంటూరు జిల్లాలో ముగ్గురు బీటెక్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా సింథటిక్ డ్రగ్‌తో పట్టబడటం కలకలం రేపుతోంది. జిల్లాలోని శివారు గడ్డిపాడు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు  వద్ద పెదకాకాని పోలీసులు నిర్వహించిన సోదాల్లో ఈ విద్యార్థులు సింథటిక్‌ డ్రగ్స్‌‌తో పట్టుబడ్డారు. 
 
ఈ ముగ్గురు బీటెక్‌ చదువుతున్న నిందితుల నుంచి 25 ట్రమడాల్‌ మాత్రలు, 25 గ్రాముల ఎల్.ఎస్‌.డి వ్రాపర్స్‌, 7 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందులతో పాటు రూ.24,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఈ మత్తును విక్రయిస్తుండటం గమనార్హం. 
 
కాగా, నిందితుల ఆరెస్టు వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియా సమావేశంలో వివరించారు. ముగ్గురు విద్యార్థులు టెలిగ్రామ్ ఆన్‌లైన్‌ ద్వారా సింథటిక్ మత్తు మందు తెప్పించుకుని విక్రయిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. కేసులో ఇంకా ఎవరి పాత్ర ఉందో విచారణ జరగాల్సి ఉందని తెలిపారు.