బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (16:25 IST)

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చెడిమాల వద్ద జరిగిన రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చింతవరం నుంచి గూడురు వైపు వెళుతున్న ఆటోను వరగలి క్రాస్ రోడ్డు నుంచి చింతవరం వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. 
 
గూడూరు సొసైటీ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ సుధాకర్ ఆటోలోనే ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు లారీ చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరిని గూడూరు మండలం చెన్నూరు దళిత వాడకు చెందిన మాతంగి రాజశేఖర్, హరిసాయిగా గుర్తించారు. వీరిద్దరూ ఓ ఏజెన్సీలో పని చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.