ఎంసెట్ స్కామ్‌పై సీఐడీ రిపోర్ట్.. 130కి మందికి పేపర్ లీక్.. పరీక్ష రద్దు దిశగా అడుగులు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష 2 లీకేజీ వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఐడీ విభాగం ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మొత్తం 130 మందికి ఎంసెట్ ప్రశ్నాపత్రం అందినట్టు తేలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష 2 లీకేజీ వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఐడీ విభాగం ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మొత్తం 130 మందికి ఎంసెట్ ప్రశ్నాపత్రం అందినట్టు తేలింది. దీంతో ఈ పరీక్షను రద్దు చేసి కొత్తగా పరీక్ష నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు... తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీకి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. కేవలం కొద్దిమందికి మాత్రమే లబ్ధి చేకూర్చిన సదరు పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహిస్తే తాము నిండా మునిగిపోతామంటూ పలువురు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి హైదరాబాదులో ఆందోళనకు దిగారు.
అదేసమయంలో పేపర్ లీకేజీకి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ విద్యార్థి విభాగం తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) నగరంలోని జేఎన్టీయూ వద్ద ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేసిన నిరసనకారులు... లీకేజీకి బాధ్యత వహిస్తూ తెలంగాణ విద్య, వైద్య శాఖ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.