బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (16:36 IST)

గుంటూరులో కరోనా.. 17మందికి కోవిడ్ పాజిటివ్.. 25 నుంచి కర్ఫ్యూ

గుంటూరు జిల్లా కోర్టులో కరోనా కలకలం రేపింది. మొత్తం 17 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల కరోనా బారిన పడిన, కోర్టు అసిస్టెంట్‌ నాజర్‌గా పనిచేస్తున్న రవి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. ముగ్గురు న్యాయమూర్తులు, ఇద్దరు బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, 12 మంది న్యాయశాఖ సిబ్బంది కరోనాతో వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 
 
కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో వుంచుకొని గుంటూరు నగరంలో ఈ నెల 25 వ తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి మరుసటి రోజు ఉదయం వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు జరుపాలని నిర్ణయించారు. 
 
కాగా.. గత 24 గంటల్లో ఏపీలో 37 వేల 922 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 8వేల 987 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఇటీవలి కాలంలో ఏపీలో ఇదే అత్యధికం. మరోవైపు కరోనా కారణంగా గత 24 గంటల్లో 35 మంది మృత్యువాత పడగా.. 3,116 మంది కోలుకున్నారు.ఇప్పటి వరకూ రాష్ట్రంలో 9 లక్షల 15 వేల 626 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 53 వేల 889 యాక్టివ్ కేసులున్నాయి.