గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 14 నవంబరు 2017 (19:30 IST)

తెదేపా మంత్రులకు వెన్నెముకలు లేవు.. జగన్ పాదయాత్ర వేస్ట్... జేసీ సెటైర్లు

జెసి బ్రదర్స్‌కు జగన్ ఫ్యామిలీ మధ్య ఉన్న రాజకీయ వైరం తెలిసిందే. గతంలో వీరు ఒకే పార్టీలో ఉన్నా విభజన అనంతరం ఏర్పడిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో జెసి టిడిపిలో చేరారు. కొన్ని రోజుల క్రితం జె.సి.ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన వ్యవహారంలో వై.ఎస్.జగన్ ఎంట్రీ ఇవ్

జెసి బ్రదర్స్‌కు జగన్ ఫ్యామిలీ మధ్య ఉన్న రాజకీయ వైరం తెలిసిందే. గతంలో వీరు ఒకే పార్టీలో ఉన్నా విభజన అనంతరం ఏర్పడిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో జెసి టిడిపిలో చేరారు. కొన్ని రోజుల క్రితం జె.సి.ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన వ్యవహారంలో వై.ఎస్.జగన్ ఎంట్రీ ఇవ్వడంతో అప్పటి నుంచి వీరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగింది. తరచూ వై.ఎస్.జగన్ పైన జె.సి.బ్రదర్స్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. 
 
వై.ఎస్. జగన్‌కు పాదయాత్ర అనవసరమన్నారు జె.సి.దివాకర్‌ రెడ్డి. ప్రజా సమస్యలను ప్రసార మాధ్యమాలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుండటం, వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కొత్తగా జగన్ పాదయాత్ర చేయడమేంటని ప్రశ్నించారు జె.సి. అంతేకాదు సొంత పార్టీ మంత్రుల పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు జె.సి. ఇప్పుడున్న మంత్రులకు అసలు వెన్నముకే లేదు. మంత్రులంటే మా పీరియడ్‌లో ఉన్నవారు మాత్రమేనని చెప్పారు జె.సి.