బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:41 IST)

బిల్లులు మంజూరు కాలేదు, ఇంటికెళ్ళి తినండి: సిఎం సొంత జిల్లాలో విద్యార్థుల కష్టాలు

ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. హాస్టళ్ళకు విడుదల చేయాల్సిన నిధులు పూర్థిస్థాయిలో విడుదల కాకపోవడంతో విద్యార్థుల పరిస్థితి దీనంగా మారింది. ముఖ్యంగా కడుపు నిండా భోజనం పెట్టే మోడల్ స్కూల్లో భోజనం పెట్టి మూడు రోజులవుతోంది.

 
ఇదంతా ఎక్కడో కాదు.. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే జరిగింది. ఖాజీపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మూడురోజుల నుంచి విద్యార్థులకు భోజనం కరువైందట.

 
ఆరు నెలలుగా ఫుడ్ కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించని కారణంగా భోజనాన్ని నిలిపేశారట కాంట్రాక్టర్. అంతేకాదు ఆకలి అనడిగితే విద్యార్థులను ఇంటికి పంపించేస్తున్నారట. ఇంటికి వెళ్ళి భోజనం చేయమని మోడల్ స్కూల్ అధ్యాపకులు చెబుతున్నారట.

 
మొదట్లో భోజనం విషయం బయటకు చెప్పొద్దని విద్యార్థులను కోరారట. కానీ ఆ తరువాత విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా అసలు విషయం బయటకు వచ్చింది.