మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 28 జనవరి 2019 (20:05 IST)

అత్యాధునిక హంగులతో జనసేన ప్రచార రథాలు.. పవన్ వేగం...

పార్టీ గుర్తు, సిద్ధాంతాలు, మ్యానిఫెస్టో ఊరూరా ప్రచారం... జనసేన పార్టీ గుర్తు, సిద్ధాంతాలు, మ్యానిఫెస్టోను ప్ర‌జ‌ల్లో మ‌రింత విస్తృత ప్ర‌చారం క‌ల్పించేలా ప్ర‌చార ర‌థాల‌ను జ‌న‌సేన పార్టీ సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేసేందుకు ఏర్పాటు చేసిన 17 ప్ర‌చార ర‌థాల‌ను జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూజ కార్యక్రమాలు నిర్వహించి, జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం సోమ‌వారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది.
 
ప్ర‌తి ప్ర‌చార ర‌థం రోజుకు 10 గ్రామాల్లో అంటే మొత్తం 17 ప్ర‌చార ర‌థాలు రోజుకు 170 గ్రామాల్లో పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో ప్‌రచారం చేసేలా ప్ర‌ణాళిక రూపొందించారు. మరో 17 రథాలు సిద్ధం అవుతున్నాయి.  ప్ర‌చారంలో భాగంగా పార్టీ గుర్తు గాజు గ్లాస్ తో ప్ర‌జ‌ల‌కు టీ ఇవ్వ‌డంతో పాటు మెంబ‌ర్ షిప్ డ్రైవ్ చేయ‌నున్నారు. అలాగే ప్ర‌చార ర‌థాల్లో అమ‌ర్చిన ఎల్ ఈడీల ద్వారా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే విధంగా రోజుకు రెండు మెయిన్ సెంట‌ర్ల‌లో శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి ప్ర‌సంగాలు ప్ర‌సారం చేయ‌నున్నారు.
 
పార్టీ గుర్తు, పార్టీ సిద్ధాంతాలు, శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి ప్ర‌సంగాల‌ను ఊరూరా ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల‌కు పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తుండిపోయేలా చేయ‌నున్నాయి.  అలాగే ప్ర‌చార ర‌థాల‌పై పార్టీ సిద్ధాంతాలు, గాజు గ్లాస్ గుర్తుకేఓటు వేయాల‌ని నినాదాలుతో పాటు పార్టీ మ్యానిఫెస్టోలోని కొన్ని హామీల‌ను ప్లెక్సీల రూపంలో ఏర్పాటు చేశారు. వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన ప్ర‌చార ర‌థాలు జ‌న‌సేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రచార రథం ప్రారంభించిన అనంతరం శ్రీ పవన్ కల్యాణ్ గారి పార్టీ గుర్తు గ్లాసులో టీ పోసి భవన నిర్మాణ కార్మికులకు అందచేశారు.