గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 28 జనవరి 2019 (10:06 IST)

కేసీఆర్ ఉచ్చులో పవన్ చిక్కడు : విజయశాంతి

ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలకు నిజంగా సమదూరం పాటిస్తున్న పవన్ కళ్యాణ్‌ను ఏదో రకంగా వివాదం లోకి లాగేందుకు టీఆరెస్ కూడా ప్రయత్నం చేస్తోంది. "మాయావతి, అఖిలేష్ యాదవ్‌ల మాదిరిగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిస్తే తప్పేంటి" అని టీడీపీ లీడర్స్ అంటున్నారు. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితుల్లో... రాజ్ భవన్‌లో కేసీఆర్ గారు, పవన్ కళ్యాణ్‌తో మతనాలు జరపడం మరింత గందరగోళానికి కారణమయింది. 
 
ఇంతకీ ఏపీకి వెళ్ళి జగన్‌తో ఫెడరల్ ఫ్రంట్ పైన చర్చిస్తానన్న కేసీఆర్... అంతకుముందే పవన్ కళ్యాణ్‌తో మంతనాలు జరపడం ద్వారా ఏమి మెసేజ్ ఇవ్వదలచుకున్నారు? కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చెయ్యడం కంటే వైసీపీ, జనసేనలను ఒకే వేదిక మీదకు తేవడమే కేసీఆర్ అసలు అజెండాగా కనిపిస్తోంది. 
 
ప్రజారాజ్యం పొత్తు వద్దని టీడీపీతో 2009లో జత కట్టిన కేసీఆర్ గురించి సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి పవన్‌కి టీఆరెస్ జిత్తులపై బాగానే క్లారిటీ ఉంటుందేమో. పవన్ అంత త్వరగా కేసీఆర్ ఉచ్చులో పడకపోవచ్చు అన్నారు విజయశాంతి.