Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రెండో విడత జనవాణి కార్యక్రమం ప్రారంభం

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 10 జులై 2022 (12:53 IST)
జనసేన పార్టీ తరపున ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన జనవాణి రెండో విడత కార్యక్రమం అదివారం విజయవాడ నగరంలో ప్రారంభమైంది. ఇందులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం గత వారం నుంచి ప్రారంభమైన విషయం తెల్సిందే. 
 
దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో రెండో విడత కార్యక్రమం కూడా ఆదివారం విజయవాడలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో పవన్‌కు చెప్పేందుకు భారీగా తరలివచ్చారు. 
 
అలాగే, వచ్చే వారం భీమవరంలో పవన్ కళ్యాణ్ పాల్గొని ఈ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించనున్నారు. పాలకులకు ప్రజా సమస్యలు విన్నవించుకునే పరిస్థితులు లేకపోవడం వల్లే జనసేన పార్టీ తరపున ప్రజా సమస్యలపై పోరాడేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పవన్ గతంలోనే ప్రకటించిన విషయం తెల్సిందే. 

అన్నీ చూడండి

దుల్కర్ సల్మాన్.. ఐ యామ్ గేమ్ నుంచి ఎవరే నువ్వే గీతం విడుదల

Shyam Prasad Reddy: అగధ లో కామాక్షి ని చూస్తే అరుంధతి లో అనుష్క ను గుర్తుచేసింది : శ్యాం ప్రసాద్ రెడ్డి

రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ పై మాయలేడి చెంగు చెంగున దూకెరా.. సాంగ్

జ్యోతి పూర్వజ్ కిల్లర్ చిత్రం తెలుగు, తమిళ సహా పలు దేశాల్లో విడుదల.

Manchu Manoj :ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు : గజ టీజర్ లాంచ్ లో మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments