బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జులై 2022 (19:42 IST)

పవన్ కళ్యాణ్‌కు ఫీవర్ - జనవాణి రద్దు

Pawan Kalyan
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ అస్వస్థతకు లోనయ్యారు. ఆయన ఫీవర్‌తో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు ఒక వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. ఫలితంగా ఆయన తన ఇంటికే పరిమితంకానున్నారు. ఈ కారణంగా వచ్చే ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని రద్దు అయింది. 
 
ఇటీవల జనవాణి కార్యక్రమంలో భాగంగా, ఉభయగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ స్వలంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు కూడా వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. 
 
అందువల్ల జూలై 24వ తేదీతో పాటు 31వ తేదీల్లో జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు.