పాటల్తో పడగొడతాడా పవన్, 2019 ఎన్నికల్లో జనసేనాని పవర్ ఏంటో?
మూడు దశాబ్దాల వెనక్కి వెళ్తే నందమూరి తారకరామారావు రాజకీయ అరంగేట్రం అప్పట్లో సంచలనం. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సినీ నేపథ్యం.. కాంగ్రెస్‌పైన వున్న విరక్తి ఒక్కసారిగా ఆయన్ను అందలం ఎక్కించాయి. పరిశ్రమకు చెందిన కళాకారుల్ని,
మూడు దశాబ్దాల వెనక్కి వెళ్తే నందమూరి తారకరామారావు రాజకీయ అరంగేట్రం అప్పట్లో సంచలనం. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సినీ నేపథ్యం.. కాంగ్రెస్‌పైన వున్న విరక్తి ఒక్కసారిగా ఆయన్ను అందలం ఎక్కించాయి. పరిశ్రమకు చెందిన కళాకారుల్ని, గాయకులను, సంగీత దర్శకుల్ని ఆయన బాగా వుపయోగించుకున్నారు. పార్టీ విధానాలు తాను చేపట్టేబోయే కార్యక్రమాలు గురించి సులువుగా అర్థం కావడానికి పాటలు తయారుచేయించారు.
ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్‌టిఆర్ ఒకవైపు సినిమా చేస్తూ.. మరోవైపు పార్టీ గురించి ప్లాన్ వేసినట్లే ఇప్పుడు పవన్ కూడా కాటమరాయుడు సినిమా షూటింగ్‌లో వుండగానే అక్కడే పార్టీ పనుల్ని ప్లాన్ చేస్తున్నాడు. ప్రముఖ గేయరచయితలు, కవులు, సంగీత దర్శకులతో సంప్రదింపులు జరిపి.. వారి నుంచి ఇన్‌పుట్స్ తీసుకుంటున్నారు.
వచ్చే ఏడాది సినిమాకు తెరదించేసి.. పూర్తిగా రాజకీయాల్లో దృష్టి సారించాలనే నేపథ్యంలో బ్యాగ్రౌండ్ చేస్తున్నాడు. 2019 ఎన్నికల్లో ఈయన రాక ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.