గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 జులై 2024 (15:27 IST)

పట్టుదల వస్తే సొంత రక్తాన్ని కూడా పక్కనపెట్టేస్తా : డిప్యూటీ సీఎం పవన్ (Video)

pawan
ప్రజాశ్రేయస్సే తనకు ముఖ్యమని, ఇందుకోసం తన కుటుంబాన్ని సైతం పక్కనబెట్టేస్తానని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పట్టుదల వస్తే సొంత రక్తాన్ని కూడా పక్కన పెడతా, సొంత కుటుంబాన్ని కూడా పక్కన పెడతా అంటూ తెలిపారు. అందువల్ల తన వద్ద వారసత్వ రాజకీయాలు తీసుకు రావొద్దని ఆయన పార్టీ నేతలకు హెచ్చరించారు. అంతేకాకుండా, నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని  బంధించి మరి జైల్లో పెట్టి భయభ్రాంతులను చేసింది గత ప్రభుత్వం అని, రోడ్డు మీద ఒకరు నోరు తెరిచి మాట్లాడాలంటే భయం ఇలాంటి నేపథ్యంలో 5 కోట్ల మందికి వెన్నుదన్నుగా నిలిచింది జనసేన పార్టీ అని ఆయన గుర్తు చేశారు.