గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (11:48 IST)

కుప్పంలో చంద్రబాబు ఎలా గెలుస్తారో.. చూస్తాం : మంత్రి పెద్దిరెడ్డి

peddireddy
వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎలా గెలుస్తారో తాను చూస్తానని ఏపీ మంత్రి, వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తనను చంద్రబాబు పుంగనూరు పుడింగి అంటూ సంబోధించడంపై మంత్రి పెద్ది రెడ్డి ఘాటుగానే స్పందించారు. మాట్లాడితే తనను పుంగనూరు పుడింగి అంటూ వ్యాఖ్యానిస్తున్నారన్నారు. కానీ, పుడింగి అంటే అర్థమేంటో తెలుసా అని ఆయన నిలదీశాలు. 
 
పుడింగి అంటే అర్థం తెలియని చంద్రబాబు తనను విమర్శించేది అని అన్నారు. పుడింగి అనే ఒక్క మాటతోనే ఆయన కంటే తానే బలవంతుడిని అనే విషయాన్ని స్వయంగా అంగీకరించారని, చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఒక్క ఓటుతోనే జిల్లా పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకున్నామని మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు. 
 
ఇకపోతే, తాను కాలేజీలో చదువుకునే రోజుల నుంచే చంద్రబాబుపై తనదే పైచేయి అని పెద్దిరెడ్డి అన్నారు. పుంగనూరులో తనను ఓడించడం చంద్రబాబు తరం కాదని, అలాగే, ఈ దఫా కుప్పం స్థానంలో చంద్రబాబు ఎలా గెలుస్తారో తాను చూస్తానని ఆయన సవాల్ విసిరారు. ఈసారి చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు.