గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 5 అక్టోబరు 2021 (12:29 IST)

ఏపీలో కిశోర బాలిక‌ల‌కు నెల‌కు 10 శానిట‌రీ న్యాప్ కిన్లు!

ఏపీలో సీఎం జగ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోయే కార్య‌క్ర‌మాల‌కు విరివిగా డ‌బ్బు వెచ్చిస్తోంది. ఖ‌జానాలో డ‌బ్బు లేదు లేదుంటూనే, ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాలు మాత్రం కొత్త‌గా రూపొందిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా  ఏపీలో కిశోర బాలిక‌ల‌కు నెల‌కు 10 శానిట‌రీ న్యాప్ కిన్లు ఉచితంగా ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. 
 
ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో చదువుతున్న 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లను అందించే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘‘7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు నెలకు 10 చొప్పున న్యాప్‌కిన్లు అందిస్తారు. బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యం. వినియోగించిన న్యాప్‌కిన్లను డిస్పోజ్‌ చేసే పద్ధతులపై నోడల్‌ అధికారులు బాలికలకు అవగాహన కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇన్సినరేటర్లు కూడా ఏర్పాటయ్యాయి’’ అని సీఎం జగన్‌ తెలిపారు.