1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (11:02 IST)

సమాజంలో శాంతి, సామరస్యాలు పెంపొందాలి : ప్రధాని మోడీ

ముస్లిం సోదరులు అత్యంత ప్రవిత్రంగా భావించే రంజాన్ మాసం ఆదివారం నుంచి ప్రారంభమైంది. దీన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "పవిత్ర రంజాన్ మాసం పేదలకు సేవ చేసేలా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సమాజంలో శాంతి, సామరస్యాలు, కరుణ పెంపొందించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. 
 
అలాగే, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. "రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లి సోదరులకు శుభాకాంక్షలు. నెల రోజులపాటు అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు