గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 5 నవంబరు 2016 (09:38 IST)

రూ.వెయ్యి అప్పు ఎగ్గొట్టేందుకు వివాహితురాలిని హత్య చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగి.. అరెస్టు

తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు వివాహితురాలిని జీహెచ్ఎంసీ ఉద్యోగి హత్య చేసిన దారుణ ఘటన ఒకటి హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన లింగంపల్లి మహే

తీసుకున్న అప్పు ఎగ్గొట్టేందుకు వివాహితురాలిని జీహెచ్ఎంసీ ఉద్యోగి హత్య చేసిన దారుణ ఘటన ఒకటి హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన లింగంపల్లి మహేందర్‌ నారాయణగూడ దత్తానగర్‌లో నివసిస్తూ జీహెచ్‌ఎంసీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. 
 
ఐదు నెలల క్రితం ఇల్లు ఖాళీచేసి చిక్కడపల్లి సూర్యనగర్‌లో రామస్వామి ఇంటిపక్కన అద్దెకు దిగాడు. అతడు కూడా జీహెచ్‌ఎంసీలో ఉద్యోగి. రామస్వామితో మహేందర్‌ సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో రామస్వామి కుమార్తె అర్చనకు 2007లో వివాహమైంది. ఆమెకు ఏడేళ్ల పాప ఉంది. నాలుగేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకొని తండ్రి వద్దే నివశిస్తోంది. మహేందర్‌ ఆమెతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. 
 
ఆమె వద్ద వెయ్యి రూపాయలు అప్పు తీసుకుని ఇవ్వలేదు. డబ్బులిస్తానని నారాయణగూడ బస్‌స్టాప్‌ వద్దకు రమ్మని గతనెల 7వ తేదీన ఆమెకు ఫోన్‌ చేశాడు. అర్చన వెళ్లగా నీ డ్రెస్‌ బాగాలేదు.. రూమ్‌కెళ్లి మార్చుకోమంటూ ఇంటికి తీసుకెళ్లాడు. క్లోరోఫామ్‌ ఉంచిన దస్తీని అర్చన ముక్కువద్ద ఉంచడంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన అతడు అర్చన మెడకు ప్లాస్టిక్‌ కవర్‌ను గట్టిగా బిగించి చంపేశాడు. 
 
మృతదేహాన్ని లగేజీ బ్యాగులో ఉంచి బర్కత్‌పుర క్రౌన్‌కేఫ్‌ ఎదురుగా ఉన్న హుస్సేన్‌ సాగర్‌ నాలాలో పడేశాడు. అర్చన హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు మహేందర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. తానే హత్య చేసినట్టు అంగీకరించాడు.