మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (16:16 IST)

తిరుపతి జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్

తిరుపతి జిల్లాలో మరోసారి పోలీసులు రెచ్చిపోయారు. తెలుగుదేశం నేతలపై కేసులు నమోదు చేశారు. యువగళం పాదయాత్రలో టీడీపీ కండువా కప్పుకున్నారన్న అక్కసుతో అక్రమంగా కేసులు పెట్టారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. యువగళం పాదయాత్రలో లోకేష్‌ సమక్షంలో, నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా టీడీపీ కండువా కప్పుకున్నారు వైకాపా నేతలు. ఈ క్రమంలో 1000కి పైగా వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. 
 
వీరిలో సీనియర్‌ నేత, కలికిరి సర్పంచ్‌ ప్రతాప్‌ రెడ్డి కూడా ఉన్నారు. అయితే బాణసంచా పేల్చి ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తిరుపతి పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు.