కాణిపాకం పూజారి ఇంట్లో జింక చర్మ స్వాధీనం
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని పోటు, గిడ్డంగి, అన్నదాన సత్రంలో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్న సమాచారంతో శనివారం ఆలయ ఈవో వెంకటేశు ఆధ్వర్యంలో సిబ్బంది ఇళ్లలో సోదాలు చేశారు.
అనుబంధ ఆలయమైన వరదరాజులస్వామి ఆలయ అర్చకుడు కృష్ణమోహన్ నివాసంలో జింకచర్మాన్ని గుర్తించి ఈవో వెంకటేశు.. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
డీఎఫ్‌వో చైతన్య కుమార్ రెడ్డి ఆదేశాలతో ఆ శాఖ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని, కృష్ణమోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ద్వారా జింకచర్మాన్ని తాను కొన్నట్లు కృష్ణమోహన్ విచారణలో వెల్లడించారని, అతడికి విక్రయించిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎఫ్‌ఆర్వో బాలకృష్ణా రెడ్డి తెలిపారు.