ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (19:50 IST)

చిత్తూరు జిల్లాలో మినీ లాక్‌డౌన్.. క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్

ys jaganmohan reddy
ఏపీలోని చిత్తూరు జిల్లాలో మినీ లాక్‌డౌన్ విధించారని.. తిరుపతిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తలపై ఏపీ సర్కారు క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియో ఇప్పటిది కాదని.. 2021కి సంబంధించినదని స్పష్టం చేసింది. 
 
లాక్‌డౌన్ లేదా కరోనా అలెర్ట్‌కు సంబంధించిన ఏవైనా ఉంటే.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ వీడియో అవాస్తవమని జగన్ సర్కారు క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వీడియోలు ఫార్వర్డ్ చేసే ముందు ఆ సమాచారాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయాలని జగన్ సర్కారు స్పష్టం చేసింది.