గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (12:18 IST)

ఏపీలో అంబులెన్స్ మాఫియాకు చెక్ పెట్టిన సర్కారు!!

ambulance
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్స్ డ్రైవర్ల మాఫియాకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇటీవల రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్ల నిర్వాకం వల్ల తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చనిపోయిన బిడ్డను ఓ కన్నతండ్రి 90 కిలోమీటర్ల దూరం మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లిన విషయం తెల్సిందే. 
 
ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతీయ మీడియా ఏపీలోని అంబులెన్స్ డ్రైవర్ల మాఫియాను బహిర్గతం చేసింది. అలాగే, రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థలోని లోపాన్ని ఎత్తి చూపింది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అంబులెన్స్ డ్రైవర్ల దందాకు చెక్ పెట్టింది. 
 
ముఖ్యంగా, చిత్తూరు జిల్లా కలెక్టర్ అంబులెన్స్ దందాపై ఆర్డీవో, డీహెచ్ఎం, ఆర్టీవోలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంబులెన్స్ డ్రైవర్లు వసూలు చేయాల్సిన ధరలను ఫిక్స్ చేశారు. ఈ ధరల పట్టికను ఆయా ఆస్పత్రుల వద్ద ప్రధానంగా ప్రచురించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 
 
ఈ ధరలకు మించి డబ్బులు వసూలు చేస్తే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈఎంటీబితో ఉన్న బేసిక్ లైఫ్ సపోర్ట్, పేషెంట్ ట్రాన్స్‌పోర్ట్ అంబులెన్స్‌లు కిలో మీటర్‌కు ఎంత మేరకు చార్జీలు వసూలు చేయాలన్న దానిపై బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.